KTR at IT Sector representatives Meeting : రాష్ట్ర ఐటీ రంగంలో ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఉత్తరం వైపు ఐటీని విస్తరిస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో ఐటీ రంగంలో 40 వేల ఉద్యోగాలు వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ థ్రిల్ సిటీలో ఐటీ రంగ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు.
తెలంగాణ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్ ఓ అద్భుతం : కేటీఆర్ - ఐటీ రంగ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశం
KTR at IT Sector representatives Meeting : పెట్టుబడుల కోసం హైదరాబాద్ అనువైన నగరమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. దేశంలో ఐటీ ఉద్యోగ కల్పనలో భాగ్యనగరంలో ముందంజలో ఉంటుందని తెలిపారు. మహానగరంలో ఉత్తరం వైపు కూడా ఐటీ రంగాన్ని విస్తరిస్తున్నట్లు వెల్లడించారు.
"మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ ఏర్పాటు చేశాం. దేశంలో ఐటీ ఉద్యోగ కల్పనలో హైదరాబాద్ ముందుంటుంది. రాష్ట్రంలో టీఫైబర్ నెట్ ద్వారా ఇంటర్నెట్ అందిస్తాం. పెట్టుబడుల కోసం హైదరాబాద్ అనువైన నగరం." - కేటీఆర్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ
గత ఎనిమిదిన్నర ఏళ్లలో తెలంగాణ.. ముఖ్యంగా హైదరాబాద్ ఐటీ రంగంలో ఎదిగిన తీరు చూస్తుంటే చాలా సంతోషమేస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది కేవలం హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు వస్తున్న పరిశ్రమలు, కంపెనీల వల్లేనని తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం అభివృద్ధికి తోడ్పడిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో పని చేస్తున్న వారిలో 20 శాతం మంది హైదరాబాద్, తెలంగాణ నుంచే ఉన్నారని వెల్లడించారు.