కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Home Minister Amit Shah) అధ్యక్షతన తిరుపతి వేదికగా ఇవాళ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది (Southern States Zonal Council Meeting - 2021). దక్షిణ భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr not attended)సమావేశానికి హాజరు కావడం లేదు. తెలంగాణ తరఫున హోంశాఖ మంత్రి మహమూద్ అలీ (Mahmood ali) సమావేశానికి హాజరు కానున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (cs somesh Kumar), ఉన్నతాధికారులు సమావేశానికి హాజరవుతారు. సమావేశానికి సంబంధించి మొత్తం 26 అంశాలను ఎజెండాలో చేర్చారు.
పొరుగు రాష్ట్రాలు, కేంద్రం ప్రతిపాదించిన ఎజెండా ప్రకారం భేటీ
2018లో బెంగళూరులో జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు అమలు తీరుపై సమీక్ష, తదుపరి జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహణతో పాటు ఇతర అంశాలపై చర్చ జరగనుంది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలు ప్రతిపాదించిన వాటితో పాటు ఆయా రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను ప్రతిపాదించాయి. వాటిపై భేటీలో చర్చ జరగనుంది. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు - రంగారెడ్డి, (Palamuru - Rangareddy) నక్కలగండి ఎత్తిపోతల పథకాలపై చర్చించాలని కర్నాటక ప్రతిపాదించింది. రెండు ప్రాజెక్టులకు ఇంకా అనుమతులు ఇవ్వలేదన్న కేంద్రజలశక్తిశాఖ (Central Department of Hydropower)... కేఆర్ఎంబీ (KRMB) పరిధిని ఖరారు చేశామని, రెండు అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో ఉన్నాయని పేర్కొంది. వాటి డీపీఆర్‌లు (project dprs) ఇంకా అందలేదని తెలిపింది. అయితే ఈ ప్రాజెక్టుల అంశం సుప్రీంకోర్టు, అపెక్స్ కౌన్సిల్, ట్రైబ్యునళ్లలో ఉన్నందున ఇక్కడ చర్చించడం సబబు కాదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
పుదుచ్చేరి ఏమంటుందంటే..
గోదావరి - కావేరి నదుల అనుసంధానాన్ని (Godavari - Cauvery river connection) పుదుచ్చేరి ప్రతిపాదించింది. నదుల అనుసంధానం విషయంలో రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నామన్న కేంద్ర జలశక్తిశాఖ... డీపీఆర్ పై నెలరోజుల్లోగా అభిప్రాయాలు చెప్పాలని రాష్ట్రాలను కోరినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆమోదం కోసం డీపీఆర్‌ను సమర్పించడంతో పాటు నీటివినియోగం, లబ్ధి తదితర అంశాలపై చర్చిస్తామని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన రాజీవ్ గాంధీ సంగంబండ ఆనకట్ట వల్ల తమ రాష్ట్రంలోని భూభాగం ముంపునకు గురవుతోందని కర్నాటక తెలిపింది. కర్నాటక ప్రభుత్వానికి డీపీఆర్ ఇచ్చాకే ప్రాజెక్టు నిర్మించినట్లు తెలంగాణ తెలిపింది. బీమా ఎత్తిపోతలలో భాగంగా సంగంబండ ఆనకట్ట నిర్మాణానికి 1996లో సాంకేతిక సలహా మండలి అనుమతులు వచ్చాయని కేంద్ర జలశక్తి శాఖ తెలిపింది.
కూర్చుని పరిష్కరించుకోవాలని గతంలోనే చెప్పిన కేంద్రం