Ktr Tweet On Irrigation Projects National Status : రాష్ట్రానికి చెందిన సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోమారు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. దేశాభివృద్ధికి తోడ్పడుతున్న రాష్ట్రాన్ని భారత ప్రభుత్వం గుర్తించాల్సి ఉందని ట్విటర్లో అన్నారు. నాడు కరవు నేలగా ఉన్న తెలంగాణ.. నేడు భారతదేశ ధాన్యాగారంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు కోరామని మంత్రి తెలిపారు.
Grant National Project Status To Telangana Irrigation : రాష్ట్రంలోని ఏదైన సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. దేశంలో అత్యధికంగా జాతీయ ప్రాజెక్టు ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఉండగా.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలోని పోలవరానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాను ఇచ్చింది. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అనేక డిమాండ్లను చేస్తున్న వేళ.. కర్ణాటకలోని అప్పర్భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కేంద్రం ఇచ్చింది. ఈ ఏడాది లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ. 5,300 కోట్లు కేటాయించింది.
సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలంటే :
1. రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల నీటి నీటి అవసరాలను తీర్చే అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులు. రెండు రాష్ట్రాల్లో ఉండడం వల్ల సమస్యలు అధికంగానే వస్తాయి.. ముఖ్యంగా రాష్ట్రాల మధ్య ఖర్చుల విభజన, పునరావాసం, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై వివాదాలు వస్తాయి. అలాంటప్పుడు కేంద్రం జోక్యం చేసుకొని ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇచ్చి సమస్యకు పరిష్కారం చూపుతోంది. పెరుగుతున్న నీటి అవసరాలు తీర్చడం, వృథాగా నీరు సముద్రంలోకి కలవకుండా నదుల అనుసంధానం కోసం చేపట్టే ప్రాజెక్టులకు కూడా జాతీయ హోదా ఇస్తారు.