తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖాళీగా ఉన్న సచివాలయ భవనాన్ని కొవిడ్​ ఐసోలేషన్​ వార్డుగా మార్చాలి' - hyderabad latest news

ఖాళీగా ఉన్న తెలంగాణ సచివాలయ భవనాన్ని కొవిడ్-19.. ఐసోలేషన్ వార్డ్​గా మార్చాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్​లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

cheruku sudhakar press meet
'ఖాళీగా ఉన్న సచివాల భవనాన్ని కొవిడ్​ ఐసోలేషన్​ వార్డుగా మార్చిలి'

By

Published : Mar 5, 2020, 11:00 PM IST

రెండు నెలలుగా కరోనాపై చర్చ జరుగుతున్నప్పటికీ... ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రజలకు ఉచితంగా మాస్కులను పంపిణీ చేయాలన్నారు.

ప్రజా అవసరాల దృష్ట్యా ఖాళీగా ఉన్న సచివాలయ భవనాన్ని ఐసోలేషన్ వార్డుగా సిద్ధం చేయాలని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. కరోనాపై వస్తున్న వదంతులను నమ్మొద్దని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

'ఖాళీగా ఉన్న సచివాల భవనాన్ని కొవిడ్​ ఐసోలేషన్​ వార్డుగా మార్చిలి'

ఇదీ చూడండి:'పేదలకు, రైతులకు ప్రాధాన్యతనిచ్చే విధంగానే బడ్జెట్​'

ABOUT THE AUTHOR

...view details