రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు ఈనెల 16 లేదా 17న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు సమాయత్తమైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాల ప్రక్రియను బోర్డు అధికారులు పూర్తి చేశారు. సోమవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తీసుకోనున్నారు.
ఈనెల 16 లేదా 17న ఇంటర్మీడియట్ ఫలితాలు..! - Latest information on Telangana Inter results
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలను ఈనెల 16 లేదా 17న విడుదల చేసేందుకు ఇంటర్‌బోర్డు సిద్ధమైంది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు.
ఈనెల 16 లేదా 17న ఇంటర్ ఫలితాలు
మంత్రి ఆమోదం పొందిన తర్వాత 16 లేదా 17న ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. రెండు సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తారు. ఈసారి దాదాపు 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.
ఇదీ చూడండి :తెలంగాణపై కరోనా పంజా... కొత్తగా 237 కేసులు
Last Updated : Jun 15, 2020, 9:06 AM IST