తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

TS Inter Exams Starts from Today: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మెుత్తం 9,47,699 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించేది లేదని బోర్డు పేర్కొంది.

Inter Exams
Inter Exams

By

Published : Mar 15, 2023, 12:19 AM IST

Updated : Mar 15, 2023, 9:27 AM IST

TS Inter Exams Starts from Today :రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ అన్ని జిల్లాల్లో అన్ని విభాగాల వారిని సమన్వయం చేస్తూ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం అన్ని జిల్లాల కలెక్టర్లకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా ఆదేశాలు జారీ చేశారు.

పరీక్షల సమయాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోరారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలు లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి విజయం సాధించాలని ఇంటర్ విద్యార్థులకు సూచించారు.

నేటి నుంచి ప్రారంభంకానున్న ఇంటర్‌మీడియట్‌ వార్షిక పరీక్షలకు ఉదయం 9 గంటలు దాటి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల మధ్యలో ఓఎంఆర్‌ పత్రాన్ని విద్యార్థులు పూర్తి చేయాలని అధికారులు సూచించారు. పరీక్షలు జరిగే ప్రతిరోజు ఉదయం 8.00 నుంచి 9 గంటల వరకు ఎగ్జామ్​కు అనుమతి ఇస్తారు. కచ్చితంగా ఏ రోజుకు ఆ రోజు ఆయా సబెక్టులకు సంబంధించి ప్రశ్నపత్రాన్ని 9 గంటలకు ఇస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు పేర్కొంది.

రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమై ఏప్రిల్‌ 4 వరకు కొనసాగనున్నాయి. తెలంగాణలో మొత్తం 9,47,699 మంది ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 29వ తేదీతో పరీక్షలు ముగుస్తాయి. గత రెండు సంవత్సరాలుగా 70 శాతం సిలబస్‌తో పరీక్షలు జరగగా... ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తోపాటు గతంలో మాదిరిగా ఈసారి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఆ అంశాలు చూసుకోకపోతే కష్టాలు తప్పవు :ముందుగాఓఎంఆర్‌ పత్రం ఇవ్వగానే అందులో విద్యార్థి పేరు, సబ్జెక్టు తదితర అంశాలను సరిచూసుకోవాలి. అనంతరం జవాబుపత్రంలో 24 పేజీలు ఉన్నాయో లేవో కూడా చెక్​చేసుకోవాలి. గతంలో కొందరు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా వెళ్లి నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వారివారి పరీక్షా కేంద్రాలకు ముందుగా చేరుకుంటే ప్రశాంతంగా ఎగ్జామ్ రాయొచ్చు.

ఇవీ చదవండి:

Last Updated : Mar 15, 2023, 9:27 AM IST

ABOUT THE AUTHOR

...view details