TS Intermediate Results 2022: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను రేపు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామన్నారు. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ వెల్లడించారు. తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్వేర్ ద్వారా పరిశీలిస్తామన్నారు జలీల్.
మే 6 నుంచి మే 24 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. మొదటి ఏడాదిలో సుమారు 4 లక్షల 64 వేలు... రెండో ఏడాదిలో దాదాపు 4 లక్షల 39 వేల మంది పరీక్షలు రాశారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్ గతంలోనే ప్రకటించారు.