ఇంటర్ విద్యార్థుల అసైన్మెంట్ స్వీకరణ, ఫీజుల చెల్లింపునకు ముడి పెట్టొద్దని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు కళాశాలలకు అదేశాలు జారీ చేసింది. ఫీజు కట్టనందుకు అసైన్మెంట్ స్వీకరించలేదని, ఫీజులు చెల్లించాలని బలవంతం చేస్తున్నట్లు తెలిస్తే తీవ్రమైన చర్యగా పరిగణిస్తామని పేర్కొంది.
'విద్యార్థుల అసైన్మెంట్, ఫీజులకు ముడి పెట్టొద్దు'
ఇంటర్ విద్యార్థుల అసైన్మెంట్ స్వీకరణపై రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఫీజులు చెల్లించకపోయినా అసైన్మెంట్లు స్వీకరించాలని ఆదేశించింది. ఆ రెండింటికీ ముడిపెట్టొద్దని తెలిపింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు
అలాంటి కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మే 5 లోపు అసైన్మెంట్ వాల్యుయేషన్ చేసి మార్కులివ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి:1నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులు ప్రమోట్