తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..? - ts inter final exams date

ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..?
ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..?

By

Published : Dec 19, 2022, 5:09 PM IST

Updated : Dec 19, 2022, 5:38 PM IST

17:05 December 19

మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్ పరీక్షలు

ఇంటర్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్

ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర తుది పరీక్షల తేదీలను తెలంగాణ రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రకటించింది. జనరల్, వొకేషనల్ కోర్సుల వారికి ఫిబ్రవరి 15, 2023 నుంచి మార్చి 3, 2023 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆదివారాల్లో సైతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ప్రాక్టికల్స్ జరగనున్నాయి. ఎథిక్స్, మానవ విలువలకు సంబంధించి మార్చి 4న, పర్యావరణ విద్యకు సంబంధించిన పరీక్ష మార్చి 6న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరగనున్నాయి.

మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం వారికి, 16 మార్చి నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో సంవత్సరం వారికి రాత పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.

ఇవీ చూడండి..:

రూ.3,12,191 కోట్లకు చేరిన తెలంగాణ అప్పులు

'చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు వచ్చా.. అన్నీ అప్పుడే చెబుతా'

Last Updated : Dec 19, 2022, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details