నేటి తెలంగాణ రేపటి భారత్: బూర నర్సయ్య గౌడ్ - bura abou cps
రేపటి భారతదేశానికి తెలంగాణ మార్గదర్శమని అన్నారు ఎంపీ బూర నర్సయ్యగౌడ్. పెట్టుబడి సాయం, పింఛన్ వంటి పథకాలు తెలంగాణ స్ఫూర్తితో కేంద్రం ప్రవేశపెట్టిందని తెలిపారు.
పార్లమెంటులో మాట్లాడుతున్న బూర
గతంలో నేటి బెంగాల్ రేపటి భారత్ అనేవారు. ప్రస్తుతం నేటి తెలంగాణ భవిష్యత్ భారత్ అని తెరాస ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. పార్లమెంటులో రైతుబంధు పథకం ప్రస్తావిస్తూ... దేశవ్యాప్తంగా అమలుకు కేంద్రం నిర్ణయించినందుకు గర్వంగా ఉందన్నారు. విభజన చట్టం హామీలు నెలవేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆదాయపన్ను పరిమితిపై హర్షం వ్యక్తం చేశారు.