Telangana ICET Counselling 2023 New Schedule : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. ఆగస్టు 14న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా వేసి.. సెప్టెంబర్ 6కు మార్పు చేసింది. దీంతో కొత్త షెడ్యూల్ను కూడా విద్యా శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. 8 నుంచి 12వ తేదీల వరకు ఐసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనుంది. సెప్టెంబరు 8 నుంచి 13వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
Telangana ICET Counselling New Schedule :సెప్టెంబర్ 17న ఎంబీఏ, ఎంసీఏ తొలివిడత సీట్ల కేటాయింపు చేయనుంది. 22 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ జరగునుంది. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు 29, 30 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో చేరాలని కన్వీనర్ తెలిపారు. 29న స్పాట్ అడ్మిషన్ల( MBA, MCA Spot Admissions) మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ వెల్లడించింది. మరోవైపు కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. దాన్ని ఆదివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు.
కొత్త షెడ్యూల్ :
అంశం | తేదీలు |
ఐసెట్ కౌన్సెలింగ్ | సెప్టెంబర్ 6 |
ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ | సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు |
ధ్రువపత్రాల పరిశీలన | సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు |
వెబ్ ఆప్షన్ల నమోదు | సెప్టెంబర్ 8 నుంచి 13వరకు |
తొలివిడత సీట్ల కేటాయింపు | సెప్టెంబర్ 17 |
తుది విడత కౌన్సెలింగ్ | సెప్టెంబర్ 22 |
తుదివిడత సీట్లు కేటాయింపు | సెప్టెంబర్ 28 |
స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు | సెప్టెంబర్ 29 |