వలస కూలీల కష్టాలపై వివిధ పత్రికల్లో ప్రచురితమైన కథనాలను సుమోటోగా తీసుకుని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ విచారణ చేపట్టింది. తమ సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే వారిని గుర్తించి వారు గమ్యస్థానాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
'వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చండి' - human rights commission orders telangana government
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న వలస కూలీలను స్వస్థలాలకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ప్రభుత్వానికి సూచించింది.

'వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చండి'
లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సూచించింది.