తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేతలకు బాసటగా నిలిచిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ - చేనేతలకు బాసటగా హెచ్​ఆర్సీ వార్తలు

ప్రతి శనివారం ఉద్యోగులందరూ చేనేత వస్త్రాలు ధరించాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా చేనేత వస్త్రాలు చేసే వారికి... తమ వంతు సాయం అందించగలుగుతామని కమిషన్ తెలిపింది.

telangana-human-rights-commission-decided-to-support-handloom-workers
చేనేతలకు బాసటగా నిలిచిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్

By

Published : Oct 8, 2020, 3:47 PM IST

చేనేత రంగానికి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ బాసటగా నిలిచింది. కార్మికులకు మద్దతు తెలిపేందుకుగాను... ప్రతి శనివారం ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించాలని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈనెల 5న నిర్వహించిన ఉద్యోగుల అభినందన సభలో... వారు ఇచ్చిన అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకున్నారు. పాతరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఉద్యోగులు వీడింగ్‌ పని పూర్తి చేసినందుకు కమిషనర్ అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details