కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర మానవ హక్కుల సంఘం అప్రమత్తమైంది. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 9వరకు మంగళ, గురువారాల్లో అత్యవసర కేసులను విచారిస్తామని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య, సభ్యులు నడిపల్లి ఆనందరావు మహమ్మద్ ఇర్ఫాన్ వెల్లడించారు.
కరోనా ఎఫెక్ట్: హెచ్ఆర్సీ ఇక వారానికి రెండురోజులే! - అప్రమత్తమైన హెఆర్సీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనాను అరికట్టే చర్యల్లో భాగంగా హెచ్ఆర్సీ అప్రమత్తమైంది. ఇవాళ్టి నుంచి 9 వరకు మంగళ, గురువారాల్లో అత్యవసర కేసులను విచారించనుంది.
అప్రమత్తమైన హెఆర్సీ.. ఆ రెండు రోజుల్లో అత్యవసర కేసుల విచారణ
రాష్ట్ర ప్రభుత్వం కరోనాను అరికట్టడానికి తీసుకుంటున్న చర్యలను అభినందించారు. ఇప్పటికే ఆయా తేదీల్లో కమిషన్ ముందు హాజరు కావాలని ఎవరికైనా ఆదేశాలు అంది ఉంటే... తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కమిషన్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు.
ఇదీ చూడండి:పది పరీక్షలు ప్రారంభం.. విద్యార్థులంతా మాస్క్‌లతో హాజరు