తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనలు పాటించాలి: జస్టిస్​ చంద్రయ్య - రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య

కరోనా నియంత్రణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు అభినందనీయమన్నారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Telangana HRC Chairmen Justice Chandraiah latest news
Telangana HRC Chairmen Justice Chandraiah latest news

By

Published : Apr 11, 2020, 8:36 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు హైదరాబాద్‌ పంజాగుట్టలోని ఊర్వశి హోటల్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య ప్రారంభించారు.

ఈ సందర్భంగా 50మంది నిరుపేదలకు...10 కేజీల బియ్యం, 3కేజీల పప్పు, 5 కేజీల గోధుమ పిండి, రెండు లీటర్ల మంచి నూనె, ఇలా దాదాపు 2వేల రూపాయల విలువ చేసే నిత్యావసర వస్తువులను ఛైర్మన్‌ పేదలకు అందజేశారు. కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, అధికారులు చెబుతున్న సూచనలు పాటించాలని ఆయన కోరారు.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST

ABOUT THE AUTHOR

...view details