తెలంగాణ

telangana

ETV Bharat / state

'తెలంగాణ జైళ్లశాఖ దేశానికే ఆదర్శం' - home minister of prisons stall ingestion in nampally telangana

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో జరుగుతున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో జైళ్లశాఖ ఏర్పాటు చేసిన స్టాల్​ను హోంమంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్ విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్​గా ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

Telangana Home minister On Prison's Stall Inauguration  in Nampally Exhibition
'తెలంగాణ జైళ్లశాఖ దేశానికే ఆదర్శం'

By

Published : Jan 7, 2020, 10:04 AM IST

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్​లో జైళ్ల శాఖ ఏర్పాటు చేసిన ఖైదీల స్టాల్​ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ రాజీవ్ త్రివేదితో కలసి హోం మంత్రి మహమ్మద్ అలీ ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడితే... లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుందని... హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూ ఏర్పడుతుందని కొంతమంది రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ వారికి సరైన సమాధానం ఇచ్చారని వెల్లడించారు.

రాష్ట్రంలో ఉన్న అన్ని జైళ్లను అభివృద్ధి చేయడమే కాకుండా... ఖైదీలకు ఆ రంగాల్లో మంచి శిక్షణ, విద్యను నేర్పిస్తున్నారని పేర్కొన్నారు. ఒక్కసారి జైలుకు వచ్చిన ఖైదీ మంచి మార్పుతో బైటకు వస్తున్నారని తెలిపారు. ఇది అధికారుల సరైన శిక్షణ వల్లనే జరుగుతుందని హోం మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఖైదీలు తయారు చేసిన వివిధ వస్తువులను హోంమంత్రి పరిశీలించారు.

'తెలంగాణ జైళ్లశాఖ దేశానికే ఆదర్శం'

ఇవీచూడండి:కార్పొరేషన్లు, పురపాలక సంస్థలలో ఎన్నికల వేడి

ABOUT THE AUTHOR

...view details