దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేశారని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బంగారు మా తెలంగాణ గృహకల్ప మార్కెట్ వేదిక అధ్యక్షుడు జనార్ధన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి ప్రారంభించారు.
'కేసీఆర్ పుట్టిన రోజును పండుగలా జరుపుకుంటున్నారు' - cm kcr birthday celebrations 2021
తెలంగాణకు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.
నాంపల్లి రక్తదాన శిబిరంలో మంత్రి మహమూద్ అలీ
తెలంగాణకు కేసీఆర్ సీఎం కావడం మన అదృష్టమని మంత్రి అన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను చూసి.. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారని చెప్పారు.