తెలంగాణ

telangana

ETV Bharat / state

పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకం: హోం మంత్రి - TELANGANA HOME MINISTER MAHMMAD ALI ON NRC BILL

హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లో రాష్ట్ర విద్యా సదస్సు జరిగింది. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ పాల్గొన్నారు.  పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకమని మరోసారి హోంమంత్రి ఉద్ఘాటించారు.

TELANGANA HOME MINISTER MAHMMAD ALI ON NRC BILL
TELANGANA HOME MINISTER MAHMMAD ALI ON NRC BILL

By

Published : Dec 26, 2019, 5:56 PM IST

పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకమని... అదే విషయాన్ని సీఎం కేసీఆర్ కూడా వెల్లడించారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పునరుద్ఘాటించారు. ఇదే విషయాన్ని ముస్లీం పెద్దలకు కూడా తెలియజేసినట్లు తెలిపారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో... హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్​లో రాష్ట్ర విద్యా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రితో పాటు శాసనమండలి మాజీ ప్రభుత్వ చీఫ్ పాతూరి సుధాకర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవిప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం కేసీఆర్​ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని హోం మంత్రి తెలిపారు. పెండింగ్​లో ఉన్న మరిన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరించే విధంగా కృష్టి చేస్తానని హామీ ఇచ్చారు.

'పౌరసత్వ బిల్లుకు తెరాస వ్యతిరేకం'

ABOUT THE AUTHOR

...view details