గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరద బాధితులకు ఇచ్చే సాయం దుర్వినియోగం అవుతోందన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నగదు రూపంలో కాకుండా బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనాథ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వరద సహాయంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం - highcourt chief justice rs chouhan recent news
జీహెచ్ఎంసీ పరిధిలో వరద సాయం దుర్వినియోగం అవుతోందన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నగదు రూపంలో కాకుండా బ్యాంకుల ద్వారా పంపిణీ చేయాలని కోరుతూ న్యాయవాది శ్రీనాథ్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.
వరద సహాయంపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
ప్రజా ప్రతినిధులు నేరుగా నగదు పంపిణీ చేస్తున్నారని.. కోట్ల రూపాయల నిధులు పక్కదారి పడుతున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. మూడు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇదీ చదవండి:'ఆ పది ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించాయి'