తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర కేసు'లో.. భాజపాకు పిటిషన్ వేసే అర్హత ఉందా..? లేదా...? - బీజేపీ తాజా వార్తలు

HC on BJP Petitions on MLAs poaching case: ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా పిటిషన్​ ఆర్హతపై నేడు హైకోర్టు నిర్ణయం వెల్లడించనుంది. భాజపా తరఫు న్యాయవాది సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోని దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయన్నారు.

HC on BJP Petitions on MLAs poaching case
BJP petition in the case of Baiting MLAs

By

Published : Nov 8, 2022, 8:28 AM IST

HC on BJP Petitions on MLAs poaching case: 'తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు'ను సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని పిటిషన్‌ వేసే అర్హత.. భాజపాకు ఉందా..? లేదా..? అనే అంశాన్ని హైకోర్టు ఇవాళ తేల్చనుంది. భాజపా పిటిషన్ విచారణార్హతపై సోమవారం వాదనలు జరిగాయి. భాజపాకు పిటిషన్ వేసే అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు.

పిటిషనర్ పేరు ఎఫ్​ఐఆర్​లో లేదన్నారు. కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉండగా, సీబీఐకి ఇవ్వాలనడం సరైంది కాదన్నారు. దర్యాప్తు పారదర్శకంగా జరగడం లేదని, పోలీసుల తీరు అనుమానాలకు తావిచ్చేలా ఉందని భాజపా తరఫు న్యాయవాది వాదించారు. సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలోని సిట్ దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయన్నారు. పిటిషన్ విచారణ అర్హతపై ఇరువైపుల న్యాయవాదులు పలు సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించారు. ఈ అంశంపై హైకోర్టు ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details