high court on gaddi annaram market: గడ్డి అన్నారం మార్కెట్ తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గడ్డి అన్నారం మార్కెట్ స్థలంలో ఆస్పత్రి నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం... కోహెడకు మార్కెట్ తరలించాలని నిర్ణయించింది. కోహెడలో పూర్తిస్థాయి మార్కెట్ నిర్మించే వరకు బాటసింగారంలో తాత్కాలిక మార్కెట్‌కు వెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమీషన్ ఏజెంట్లు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సింగిల్ జడ్జి కొట్టివేశారు. సింగిల్ జడ్జి ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై కొంతకాలంగా విచారణ జరిపిన హైకోర్టు తీర్పు వెల్లడించింది. విస్తృత ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకోవచ్చునంటూ సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం అప్పీల్‌ను కొట్టివేసింది. ప్రతీ విషయంలో కోర్టు విచక్షణాధికారాన్ని వినియోగించలేదని.. రోజు వారీ అభివృద్ధి పనుల్లో జోక్యం చేసుకోలేదని పేర్కొంది.
high court on gaddi annaram market: గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
20:38 December 13
గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు
ప్రజా ప్రయోజనాలే ముఖ్యం..
కొవిడ్ వల్ల ఎంతో మంది చనిపోయారని... కాబట్టి మార్కెట్‌పై ఆధారపడిన కొందరి ప్రయోజనాల కన్నా విస్తృత ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. బాట సింగారం మార్కెట్‌కు వెళ్లేందుకు వ్యాపారులకు నెల రోజుల గడువు ఇచ్చింది. అయితే బాటసింగారం తాత్కాలిక మార్కెట్లో పూర్తి స్థాయి సదుపాయాలు లేవని.. న్యాయ సేవాధికార సంస్థ, కోర్టు కమిషన్ నివేదికలు ఇచ్చాయని ధర్మాసనం ప్రస్తావించింది. కాబట్టి నెల రోజుల్లో బాటసింగారం మార్కెట్లో తగిన వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశించినప్పటికీ వ్యాపారులను గడ్డి అన్నారం మార్కెట్లోకి అనుమతించకపోవడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కౌంటర్లు కూడా దాఖలు చేయనందుకు గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముత్యం రెడ్డి, కార్యదర్శి పి.హర్షపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం.. కోర్టు ధిక్కరణ కింద ఇద్దరికీ 2 వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చదవండి:
Gaddiannaram Fruit Market : గడ్డి అన్నారం మార్కెట్ తరలింపుపై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు