High Court on gutka: గుట్కా, పాన్ మసాలాపై నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు - పాన్మసాలాపై నిషేధం
11:32 November 30
కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మృతి: హైకోర్టు
High Court on gutka: కరోనా కంటే గుట్కా వల్లే ఎక్కువమంది మరణిస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. గుట్కా, పాన్ మసాలా, ఖైనీలపై నిషేధాన్ని హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులను తప్పుపట్టలేమంటూ 161 పిటిషన్లను కొట్టివేసింది. రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, జర్దా, పలు పొగాకు ఉత్తత్పుల తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తూ రాష్ట్ర ఆహార భద్రత, ప్రమాణాల కమిషనర్ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు.
gutka, pan masala ban: నిషేధాన్ని సవాల్ చేస్తూ పలువురు ఉత్పత్తి దారులు, విక్రేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఉత్పత్తి దారులు, విక్రేతలపై తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో.. విక్రయాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. నిషేధాన్ని దాఖలు చేస్తూ పిటిషన్లన్నింటినీ కలిపి సుదీర్ఘ విచారణ చేపట్టిన తర్వాత... నేడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అనేక వ్యాధులకు కారణమవుతున్న గుట్కా, పాన్ మసాలా, ఖైనీ, జర్దా వంటి ఉత్పత్తులను ప్రభుత్వం నిషేధించడం సమర్థనీయమేనని పేర్కొంది.