పదో తరగతి పరీక్షలపై ఉన్నత న్యాయస్థానం ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యా శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా.... హైకోర్టు లేవనెత్తిన సందేహలపై నివేదిక సమర్పించనుంది. ఆగస్టు లేదా సెప్టెంబరులో జరగనున్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైనా వారిని రెగ్యులర్ పరిగణిస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది.
పది పరీక్షలపై హైకోర్టు తుది నిర్ణయం - education news in telangana
పదో తరగతి పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. పరీక్షల విషయమై ఇవాళ... ఉన్నత న్యాయస్థానం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సోమవారం నుంచి పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర విద్యా శాఖ ఇప్పటికే ఏర్పాట్లు చేసింది. హైకోర్టు లేవనెత్తిన సందేహాలపై విద్యాశాఖ నేడు నివేదిక సమర్పించనుంది.
పది పరీక్షలపై హైకోర్టు తుది నిర్ణయం
దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్చించిన అనంతరం సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు ఉన్న చోటే పరీక్ష రాసేందుకు అనుమతించే అంశాన్ని సైతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటామని....పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలని ధర్మాసనాన్ని మరోసారి కోరనుంది.
ఇదీ చూడండి:పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?