ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ సునీల్ శర్మను ఇవాళ విచారణకు హాజరు కావాలని ఈనెల 29న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం, జీహెచ్ఎంసీ చెల్లించిన నిధులు, బకాయిలు తదితర వివరాలపై ఎండీ నివేదించనున్నారు. ప్రభుత్వం 4,243 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిందా... బకాయిలు కూడా చెల్లించిందా... తెలపాలని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ 335 కోట్ల రూపాయలు చెల్లించిందా.. లేదా... ఆర్టీసీలో 31 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి సమ్మె విషయం నివేదించారా అనే అంశాలను ఎండీ నేడు వివరించనున్నారు. ఎండీతో పాటు ఆర్టీసీలో ఆర్థిక వ్యవహారాలు చూసే అధికారి కూడా హాజరు కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ - Today_Rtc_Case in highcourt
ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో నేడు మరోసారి విచారణ జరగనుంది. ఆర్టీసీ ఇంఛార్జీ ఎండీ కోర్టుకు హాజరై పలు అంశాలను న్యాయస్థానానికి వివరించనున్నారు.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
Last Updated : Nov 1, 2019, 7:20 AM IST