తెలంగాణ

telangana

ETV Bharat / state

ts high court: 'చారిత్రక కట్టడాలను సర్వే చేసి అభివృద్ధి చేయాలి' - Telangana news today

రాష్ట్రంలోని 27 చారిత్రక కట్టడాలను అధికారులు, కమిటీ క్షేత్రస్థాయి సర్వే చేసి అభివృద్ధి చేయాలని హైకోర్టు(ts high court) తెలిపింది. ఈ మేరకు ఆరు వారాల్లో ఓ కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలని వెల్లడించింది.

telangana high court news
ts high court: 'చారిత్రక కట్టడాలను సర్వే చేసి అభివృద్ధి చేయాలి'

By

Published : Jun 10, 2021, 10:52 PM IST

రాష్ట్రంలోని 27 చారిత్రక కట్టడాలను అధికారులు, కమిటీ క్షేత్రస్థాయి సర్వే చేయాలని హైకోర్టు(ts high court) ఆదేశించింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ సహా చారిత్రక కట్టడాలన్నీ సర్వే చేసి దెబ్బతిన్న వాటిని అభివృద్ధి చేయాలని స్పష్టం చేసింది.

గోల్కొండ, కుతుబ్ షాహి టూంబ్స్ దెబ్బతిన్నాయని.. అధికార యంత్రాంగం స్పందించడం లేదన్న పత్రికల కథనాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది.

హైకోర్టు(ts high court) ఆదేశాల మేరకు ఏప్రిల్ 19న కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తరఫు న్యాయవాది తెలిపారు. దెబ్బతిన్న చారిత్రక కట్టడాల అభివృద్ధి కోసం మే నెలలో కమిటీ ప్రణాళిక రూపొందించిందని.. పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం ఇవ్వాలని కోరారు.

నిరాకరించిన హైకోర్టు.... ఆరు వారాల్లో కమిటీతో పాటు పురావస్తు శాఖ, ఇతర విభాగాల అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి:CCMB: కరోనా రాకుండా మాస్కు ఎలా ధరించాలో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details