తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆ వివాదాలకు 2 వారాల్లో పరిష్కారం చూపాలి' - చెరువుల్లో చేపలపై హక్కుల వివాదం

పంచాయతీరాజ్, మత్స్యశాఖలతో సంయుక్త సమావేశం జరిపి.. చెరువుల్లో చేపలపై హక్కులకు సంబంధించిన వివాదాలకు రెండు వారాల్లో పరిష్కారం చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

telangana high court said fisheries disputes should be resolved within 2 weeks
'ఆ వివాదాలకు 2 వారాల్లో పరిష్కారం చూపాలి'

By

Published : Mar 19, 2021, 9:21 PM IST

పంచాయతీరాజ్, మత్స్యశాఖలతో సంయుక్త సమావేశం నిర్వహించి.. చెరువుల్లో చేపలపై హక్కులకు సంబంధించిన వివాదాలకు రెండు వారాల్లో పరిష్కారం చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లోని చెరువుల్లో చేపలు పట్టే హక్కులపై మత్య్సకార సంఘాలు, పంచాయతీలకు మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఆ వివాదానికి సంబంధించి దాఖలైన పలు వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది.

చెరువుల్లో చేపలపై పంచాయతీల హక్కులు, మత్యకారుల హక్కులు తేల్చాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. మత్స్యకార సంఘాలు లేని పంచాయతీల్లో ఎవరికి హక్కులు ఉంటాయనే వివాదం కూడా ఉందని తెలిపింది. పంచాయతీల విభజనతోనే ఈ వివాదాలు తలెత్తాయని ధర్మాసనం తెలిపింది. పంచాయతీ రాజ్ లేదా మత్స్యశాఖ కమిషనర్​పై వివాదం పరిష్కార బాధ్యతలు పెట్టలేమని అభిప్రాయ పడింది. మత్స్యశాఖ, పంచాయతీరాజ్ కమిషనర్లతోపాటు సంబంధిత అధికారులందరితో సీఎస్ చర్చించి రెండు వారాల్లో పరిష్కారం నిర్ణయించాలని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి :నకిలీ పాసు పుస్తకాలతో రుణాలు...12 మంది అరెస్టు

ABOUT THE AUTHOR

...view details