పట్టభద్రుల ఓటు నమోదుకు గడువు పెంపు పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఓటు నమోదు గడువు శుక్రవారంతో ముగుస్తున్న నేపథ్యంలో... డిసెంబరు 7 వరకు పొడిగించాలని కోరుతూ న్యాయవాది రమేశ్ దాఖలు చేసిన పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అక్టోబరు 1 నుంచి నవంబరు 7 మధ్యే ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుందని హైకోర్టుకు... ఈసీ తరఫు న్యాయవాది అవినాష్ దేశాయ్ వివరించారు. నోటిఫికేషన్ ప్రకారం ఓటరు నమోదు గడువు నేటితో ముగుస్తుందని తెలిపారు.
పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం
పట్టభద్రుల ఓటరు నమోదు గడువు నేటితోనే ముగుస్తుందని.. అవసరమైతే డిసెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పట్టభద్రుల ఓటు నమోదు గడువును పొడిగించడం చట్ట ప్రకారం వీలుకాదని హైకోర్టుకు... ఈసీ తెలిపింది.
పట్టభద్రుల ఓటు నమోదుకు మరో అవకాశం: హైకోర్టు
డిసెంబరు 1న ముసాయిదా జాబితా ప్రకటించిన తర్వాత అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు. కాబట్టి ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు డిసెంబరు 1 నుంచి 7 వరకు అభ్యంతరాల రూపంలో దరఖాస్తు చేసుకోవచ్చునని వివరించారు. ఈసీ వివరణ నమోదు చేసిన హైకోర్టు.. గడువు పొడిగించాలన్న పిటిషన్ పై విచారణ ముగించింది.
ఇదీ చూడండి:పటాన్చెరులో సీఎం ఓఎస్డీ ఆకస్మిక పర్యటన.. ధరణి పనితీరు పరిశీలన