విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మొదట ఈడీ కేసులు విచారించాలన్న ఉత్తర్వులు కొట్టివేయాలని పిటిషనర్లు విజ్ఞప్తి చేశారు. మొదట సీబీఐ కేసులు లేదా రెండూ ఒకేసారి విచారించాలని వాదనలు వినిపించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకరణ్ రెడ్డి వాదనలు వినిపించారు.
TELANGANA HC: విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై విచారణ.. - ap cm jagan
విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. మొదట సీబీఐ కేసులు లేదా రెండూ ఒకేసారి విచారించాలనన్న దానిపై ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది.
తెలంగాణ హైకోర్టు విచారణ
సీబీఐ, ఈడీ కేసులు వేర్వేరని స్పష్టం చేశారు. మనీలాండరింగ్ చట్టాన్ని 2019లో సవరించారని.. ఇందుకు సంబంధించిన అభియోగాలపై విచారణ జరపాలని కోరారు. ప్రధాన కేసుతో సంబంధం లేకుండా విచారణ జరపాలని చెప్పారు. ఈడీ ఛార్జిషీట్లపై విచారణ జరపాలని అదనపు సొలిసిటర్ జనరల్ విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి:AP schools reopen: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలు పునఃప్రారంభం ఎప్పుడంటే..!