Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు - ఓటుక నోటు కేసు వార్తలు

14:43 June 01
Revanth Reddy: ఓటుకు నోటు కేసులో రేవంత్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అ.ని.శా. కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టు(High Court)లో పిటిషన్ వేశారు. ఓటుకు నోటు కేసు(Vote For Note) అ.ని.శా కోర్టు పరిధిలోకి రాదని పిటిషన్లో పేర్కొన్నారు.
ఎన్నికల సంబంధిత వివాదాలకు అవినీతి నిరోధక చట్టం వర్తించందన్నారు. దీనిపై విచారణ చేపట్టిన రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది.
ఇదీ చదవండి:CORONA: ప్రభుత్వం సమర్పించిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి