ఏ చట్టం ప్రకారం విశ్రాంత ఉద్యోగుల పింఛన్లపై కోత విధించారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. పింఛన్ల కోతపై దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఇవాళ వివరణ ఇవ్వాలని ఈనెల 15న ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేతనాలు, పింఛన్ల కోతపై ఆర్డినెన్స్ జారీ చేసినట్లు ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఆ ఆర్డినెన్స్ వివరాలను పిటిషన్ తరఫు న్యాయవాదులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు - తెలంగాణ తాజా వార్తలు
విశ్రాంత ఉద్యోగుల పింఛన్ల కోతపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. ఏ చట్టం ప్రకారం కోత విధించారో తెలపాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం... తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఏ చట్టం ప్రకారం పింఛన్లలో కోత విధించారు: హైకోర్టు
ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ పిటిషన్ సవరణకు న్యాయవాది ప్రభాకర్ అనుమతి కోరగా... తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.
ఇదీ చూడండి:కల్నన్ సంతోశ్ చివరి క్షణాల్లో మనసులో రాసుకున్న ప్రేమలేఖ!