కోర్టు ధిక్కరణ కేసుల కోసం నిధుల కేటాయింపుపై సీఎస్ సోమేశ్ కుమార్.. హైకోర్టుకు వివరణ ఇచ్చారు. రూ.58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని సీఎస్ స్పష్టం చేశారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ ఆరోపించారు. వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామన్న సీఎస్.. నిధులు విడుదల చేయవద్దన్న ఆదేశాలు ఉపసంహరించాలని ధర్మాసనాన్ని కోరారు. కేటాయించిన నిధులు కోర్టు ధిక్కరణ కేసుల్లో భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని స్పష్టం చేసిన ఏజీ ప్రసాద్.. పిల్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరారు.
జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా?: హైకోర్టు
11:13 August 05
జీవో రాసిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు
విచారణ జరిపి పరిశీలిస్తాం..
వాదనలు విన్న ధర్మాసనం.. జీవో రాసిన తీరుపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. జీవో ఉద్దేశమేమిటి.? కాగితంపై రాసిందేమిటని ప్రశ్నించింది. ధిక్కరణ కేసుల ఖర్చుల కోసమేనన్న విధంగా జీవో కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవో ఎలా రాశారో న్యాయ శాఖ చూడాలి కదా అని అభిప్రాయపడింది. ఇవాళ, రేపు విచారణ చేపట్టలేమన్న ధర్మాసనం.. సోమవారం విచారణ జరిపి పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి:Etela Rajender: 'ఉద్యమకారులను రాళ్లతో కొట్టిన వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు'