కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారో ఈనెల 6 లోగా తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రైవేట్ ఆస్పత్రులను క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించాలని.. సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న వారు 14 రోజులు అక్కడ ఉండేందుకు అనుమతించేలా ఆదేశాలివ్వాలవి కోరుతూ న్యాయవాది మూర్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు, జస్టిస్ లక్ష్మణ్ల ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు
ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారో తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అందుకు ఈ నెల 6 వరకు గడువు ఇచ్చింది. ప్రవేట్ ఆస్పత్రులను క్వారంటైన్ కేంద్రాలుగా వినియోగించాలన్న న్యాయవాది మూర్తి రాసిన లేఖను ఉన్నత న్యాయస్థానం ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.
ప్రైవేట్ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు