TS HC on Disha Accused Encounter case : దిశ అత్యాచార, హత్య నిందితుల ఎన్‌కౌంటర్ పట్ల సిర్పూర్కర్ కమిషన్ అందజేసిన నివేదికపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్‌కౌంటర్‌కు గురైన బాధితుల తరఫున ప్రముఖ న్యాయవాది వృందా గోవత్ వాదనలు వినిపించారు. బాధితుల తరఫున వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. అదే రోజున ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.
దిశ నిందితుల ఎన్‌కౌంటర్ కేసు.. హైకోర్టులో మరోసారి విచారణ - దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్ కేసు
TS HC on Disha Accused Encounter case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిశ అత్యాచార, హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్ నివేదికను త్వరగా అమలు చేయాలని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబసభ్యుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వృందా గోవత్ కోరారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
TS HC on Disha Accused Encounter case
ఈ కేసులో సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదికను వెంటనే అమలు చేయాలని ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన వారి కుటుంబసభ్యుల తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది వృందా గోవత్ కోరారు. కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 10మంది పోలీసు అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. ఈ ఘటన జరిగి మూడేళ్లు పూర్తవుతుందని... బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.
Last Updated : Jan 2, 2023, 5:15 PM IST