నిలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరాలో కాంట్రాక్టర్ అక్రమాలపై దర్యాప్తు జరపాలని హైకోర్టులో వేసిన పిల్‌పై బుధవారం విచారణ జరిగింది. కాంట్రాక్టర్ సురేష్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తు జరపాలని పిల్లో పేర్కొనగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ కాంట్రాక్టర్‌పై విచారణ నివేదికను సమర్పించారు. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేశారని నివేదిక పేర్కొంది. నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించింది.
'తప్పుడు బిల్లులు పెట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి' - telangana high court on niloufer hospital food contractor
నిలోఫర్ ఆసుపత్రిలో భోజనం సరఫరాలో కాంట్రాక్టర్ అక్రమాలపై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. తప్పుడు బిల్లులతో నిధులు దుర్వినియోగం చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని.. ఆ మేరకు సెప్టెంబర్ 16 లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
'తప్పుడు బిల్లులు పెట్టిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోండి'
ఇదే కాంట్రాక్టర్‌ను గాంధీ, ఛాతీ ఆసుపత్రుల్లోనూ ఎలా కొనసాగిస్తున్నారని హైకోర్టు మండిపడింది. కాంట్రాక్టర్‌పై రెండు వారాల్లో చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సురేష్‌పై తీసుకున్న చర్యలను సెప్టెంబర్ 16 లోగా నివేదిక సమర్పించాలని న్యాయస్థానం సర్కారుకు సూచించింది.
ఇదీ చూడండి:నోయిడా పవర్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం