తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana High Court on Gangula Kamalakar Election : గంగుల కమలాకర్ ఎన్నిక వివాదం.. బండి సంజయ్​పై హైకోర్టు ఆగ్రహం - బండి సంజయ్​పై హైకోర్టు ఆగ్రహం

Telangana High Court on Gangula Kamalakar Election Controversy : మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదన్న బండి సంజయ్ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ మేరకు పిటిషన్ వేసిన బండి సంజయ్ తీరుపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రాస్ ఎగ్జామినేషన్‌కు హాజరయ్యేందుకు పలుమార్లు గడువు కోరడంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Telangana High Court
Gangula Kamalakar Election Controversy

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2023, 3:38 PM IST

Updated : Sep 5, 2023, 7:20 PM IST

Telangana High Court on Gangula Kamalakar Election Controversy :మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై నేడు రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది. మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ గతంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం(High Court) బండి సంజయ్​ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

High Court Angry on Bandi Sanjay : ప్రస్తుతం బండి సంజయ్​ అమెరికా పర్యటనలోఉన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు క్రాస్ ఎగ్జామినేషన్​కు బండి సంజయ్​ హాజరయ్యేందుకు గడువు ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు. పలుమార్లు గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎన్నికల పిటిషన్లు 6 నెలల్లో తేల్చాల్సి ఉన్నందున విచారణను ముగిస్తామని హైకోర్టు చెప్పడంతో.. ఈ నెల 12వ తేదీన బీజేపీ నేత బండి సంజయ్(BJP Leader Bandi Sanjay) హాజరవుతారని ఆయన తరఫున న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్​కు హాజరుకావాలంటే సైనిక సంక్షేమ నిధికి బండి సంజయ్ రూ.50 వేలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.

2018 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assmbly Elections 2018) కరీంనగర్ అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా గంగుల కమలాకర్.. బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ పోటీ చేయగా.. ఆ ఎన్నికల్లో సంజయ్ ఓడిపోయారు. గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఎన్నికల అఫిడవిట్​లో గంగుల కమలాకర్ తప్పుడు సమాచారం ఇచ్చారని హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్​పై న్యాయస్థానం విచారణ నిర్వహిస్తోంది. అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్.. బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్​ పోటీ చేయగా.. బండి సంజయ్ విజయం సాధించారు.

ED Notices to Shwetha Granites and Shwetha Agencies : మంత్రి గంగుల ఫ్యామిలీకి చెందిన.. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌కు ఈడీ నోటీసులు

ED Notices To Minister Gangula :మరోవైపు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌(Minister Gangula Kamalakar) కుటుంబసభ్యులకు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫెమా నిబంధనల కింద జరిమానా ఎందుకు విధించకూడదో చెప్పాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. శ్వేతా గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్‌ పేరిట గ్రానైట్‌ కంపెనీలను గంగుల సుధాకర్‌, గంగుల వెంకన్న నిర్వహిస్తున్నారు. గ్రానైట్స్‌ను చైనాకు ఎగుమతి చేసిన ఈ రెండు కంపెనీలు.. ఫెమా నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ అధికారులు తేల్చారు.

ఈ మేరకు ఈడీ నోటీసులపై మంత్రి గంగుల కమలాకర్‌ స్పందించారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. మీడియా వాళ్లు చెబితేనే తనకు తెలిసిందన్న మంత్రి గంగుల.. 2008 నుంచి ఈడీ నోటీసులు వస్తూనే ఉన్నాయని అసహనం వ్యక్తం చేశారు. 3 దశాబ్దాలుగా శ్వేతా గ్రానైట్స్ ఎప్పుడూ తప్పు చేయలేదని.. గిట్టని వాళ్లు తమపై ఎన్నో ఫిర్యాదులు చేశారని పేర్కొన్నారు. ఈడీ నోటీసులు ఇస్తే పత్రాలు చూపించడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. తాము బ్యాంకు లావాదేవీలు చేశామని, హవాలా చేయలేదని స్పష్టం చేశారు.

Bandi Sanjay America Tour : అమెరికాలో బండి సంజయ్​కు ఘన స్వాగతం.. స్క్వేర్ బిల్​ బోర్డులో ఎంపీ ఫొటో

Bandi Sanjay America Tour : అమెరికాలో బండి సంజయ్ పర్యటన.. అమెరికన్​ ప్రోగ్రెసివ్​ తెలుగు అసోసియేషన్​ 15వ వార్షికోత్సవంలో ప్రసంగం

Last Updated : Sep 5, 2023, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details