ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది అందరికీ తగినన్ని కరోనా రక్షణ కిట్లు అందాయో లేదో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. వైద్య సిబ్బందికి కరోనా రక్షణ కిట్లు సరఫరా చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ గతంలో దాఖలైన పలు వ్యాజ్యాలపై ఇవాళ హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
పలు ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందికి ఇప్పటికీ ఎన్ 95 మాస్కులు, పీపీఈ, సర్జికల్ కిట్లు లేవని న్యాయవాదులు వాదించారు. స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వైద్య సిబ్బందికి తగినన్ని కిట్లు ఇచ్చినట్లు తెలిపారు. కొన్ని పత్రికల్లో తప్పుడు కథనాలు వస్తున్నాయని.. వాటి ఆధారంగా వాదించడం సరికాదన్నారు.