తెలంగాణ

telangana

ETV Bharat / state

ONLINE CLASSES IN TELANGANA: 'ఈ నెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్​లైన్ బోధన'

TS Highcourt on corona
కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ

By

Published : Feb 3, 2022, 11:33 AM IST

Updated : Feb 3, 2022, 1:57 PM IST

11:27 February 03

'మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు'

ONLINE CLASSES IN TELANGANA: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ బోధన కూడా కొనసాగించాలని ఆదేశించింది. ఈనెల 20 వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్​లైన్ బోధన కొనసాగించాలంది.

''ఫిబ్రవరి 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు.. ఆన్​లైన్​ బోధన కొనసాగించండి. హైదరాబాద్​లో మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాల్సిందే. సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయండి. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్ నిబంధనలు అమలయ్యేలా చూడాలి. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. '

- తెలంగాణ హైకోర్టు

రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతోందని పాజిటివిటీ రేటు 3.40శాతం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీలో 4.64 శాతం, మేడ్చల్‌లో 3.76 శాతం పాజిటివిటీ రేటు ఉందని నివేదికలో పేర్కొన్నారు.

డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక

రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు తగ్గింది. అత్యల్పంగా గద్వాలలో 1.45శాతం పాజిటివిటీ రేటు ఉంది. 99 లక్షల ఇళ్లల్లో ఫీవర్‌ సర్వే చేశారు. కొవిడ్‌ లక్షణాలు ఉన్న 4.32 లక్షల మందికి మెడికల్ కిట్లు అందించాం. పిల్లల చికిత్సకు ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లు చేశాం. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు జరుగుతున్నాయి. మేడారం జాతరలో కొవిడ్ నిబంధనల అమలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిమని. కరోనా పరీక్షలు, వైద్య శిబిరాలు, అంబులెన్సులు సిద్ధం చేశామని హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో వెల్లడించారు.

విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోవద్దనే ఉద్దేశంతోనే పాఠశాలలు తెరిచినట్లు విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. విద్యాసంస్థల్లో కొవిడ్ నియంత్రణ చర్యలు అమలు చేస్తున్నట్లు నివేదికలో డీహెచ్‌ శ్రీనివాసరావు తెలిపారు. రెండు వారాల్లో కరోనా ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని హైకోర్టు సూచించింది. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: డీహెచ్ శ్రీనివాసరావు నివేదిక

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

Last Updated : Feb 3, 2022, 1:57 PM IST

ABOUT THE AUTHOR

...view details