సినీ దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్‌కు భూమిని కేటాయించటంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల్లాలో ఎకరా రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను శంకర్‌కు ప్రభుత్వం కేటాయించింది. గతేడాది జూన్ 21న ప్రభుత్వం జారీ చేసిన జీఓ 75ను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాలకు చెందిన జె.శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దర్శకుడు శంకర్‌కు భూమి ఎందుకు కేటాయించారు. - undefined
దర్శకుడు ఎన్.శంకర్‌కు భూమి ఎందుకు కేటాయించారో పూర్తి వివరాలు తెలియజేయాలంటూ. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది జూన్21న 5 ఎకరాలు కేటాయిస్తూ. ప్రభుత్వం ఇచ్చిన జీఓ 75ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... రిజిస్టర్ విలువ ఎకరా రూ.20 లక్షల వరకు ఉంటుందన్నారు. మార్కెట్ విలువ రూ.5 కోట్లదాక ఉండగా... ప్రభుత్వం కేవలం రూ.5 లక్షలకే కేటాయించిందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ట్రస్టీగా ఉండాల్సిన ప్రభుత్వం తనకు నచ్చిన వారికి ప్రజల భూమిని కేటాయించరాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం ప్రతివాదులైన రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్.ఎం.డీ.ఎ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సీసీఎల్ఏ, దర్శకుడు ఎన్.శంకర్‌కు నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.