Telangana HC on MLAs Poaching Case : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణకు అప్పగించాలన్న భాజపా పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై విశ్వాసం లేదని.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిందితులకు భాజపాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ తమ నేతలపై దుష్ప్రచారం చేసేందుకు రాజకీయంగా ఈ కేసులు పెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు.
Telangana HC on MLAs Poaching Case Teuegu : గతంలో ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు దర్యాప్తు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఆ కేసు దర్యాప్తు ఆగిపోయింది. అయితే భాజపా పిటిషన్ కొట్టివేయాలంటూ కేసు తీవ్రతను వివరిస్తూ గురువారం ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. సుమారు మూడు గంటల వీడియోలను కూడా హైకోర్టుకు సమర్పించింది. ఈ కేసులో ఫోన్ టాపింగ్ జరిగిందని తనను ఇంప్లేడ్ చేయాలంటూ జర్నలిస్టు శివప్రసాద్ రెడ్డి కూడా ఓ పిటిషన్ దాఖలు చేశారు.