Krishna Water Dispute : అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. అన్ని జల విద్యుత్ ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి చేసేలా గతేడాది జూన్లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సర్కారు జీవోలను సవాల్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు.
అంతర్రాష్ట్ర జల వివాదంపై విచారణ జరపలేం: హైకోర్టు - తెలంగాణ హైకోర్టు వార్తలు
Krishna Water Dispute : అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జల విద్యుత్ ఉత్పత్తిపై తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ రైతులు గతేడాది దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించింది.
![అంతర్రాష్ట్ర జల వివాదంపై విచారణ జరపలేం: హైకోర్టు Telangana High Court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14478043-443-14478043-1644943737450.jpg)
Telangana High Court
అంతర్రాష్ట్ర జలవివాదాలపై విచారణ జరపలేమని.. సుప్రీంకోర్టు లేదా ప్రత్యేక కోర్టులకే ఆ పరిధి ఉంటుందని తెలంగాణ సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం పేర్కొంది. పిటిషన్పై విచారణ ముగించిన ధర్మాసనం.. చట్టపరమైన ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది.
ఇదీ చూడండి :గోదావరి-కావేరి అనుసంధానంపై ఈనెల 18న జలశక్తి శాఖ కీలక భేటీ