'రూ. 2.5 కోట్ల భూమిని రూ.5 లక్షలకు దర్శకుడు శంకర్‌కు ఎలా కేటాయించారు' - diretor shankar land issue news
13:37 August 10
దర్శకుడు శంకర్‌కు భూకేటాయింపుపై హైకోర్టులో విచారణ
దర్శకుడు ఎన్.శంకర్‌కు హైదరాబాద్ శంకర్‌పల్లిలో ఐదెకరాల భూమి కేటాయించడంపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎకరం రూ. 5 లక్షల చొప్పున ఆ స్థలంలో రూ. 50 కోట్ల వ్యయంతో స్టూడియో నిర్మించనున్నట్లు దర్శకుడు శంకర్ వివరించారు. దాని ద్వారా దాదాపు 300 మందికి ఉపాధి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఆ స్థలం ఎకరం రూ. 2.5 కోట్లు ఉంటుందని హెచ్ఎండీఏ పేర్కొంది. రూ. రెండున్నర కోట్లున్న భూమిని రూ. ఐదు లక్షలకే ఎలా కేటాయించారంటూ హైకోర్టు ప్రశ్నించింది. కేబినెట్ నిర్ణయానికి కూడా ఓ ప్రాతిపదిక ఉండాలన్న న్యాయస్థానం.. భూకేటాయింపులు నిర్దిష్ట పద్ధతిలో జరగాలని సుప్రీంకోర్టు పేర్కొన్నట్లు తెలిపింది. అడ్వకేట్ జనరల్ క్వారంటైన్‌లో ఉన్నందున ప్రభుత్వ న్యాయవాది గడువు కోరగా తదుపరి విచారణను ఆగస్టు 27కి వాయిదా వేసింది.