తెలంగాణ

telangana

ETV Bharat / state

gaddiannaram market: గడ్డి అన్నారం మార్కెట్‌ ఖాళీ చేయాల్సిందే: హైకోర్టు

gaddiannaram market: గడ్డి అన్నారం మార్కెట్​ను శుక్రవారంలోగా ఖాళీ చేయాలని వ్యాపారులను హైకోర్టు ఆదేశించింది. ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకం సృష్టించడం దురదృష్టకరమని పేర్కొంది. మార్కెట్ తరలింపుపై విచారణను 2 వారాలకు ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది.

By

Published : Mar 15, 2022, 7:15 PM IST

gaddiannaram market
గడ్డి అన్నారం మార్కెట్

gaddiannaram market: హైదరాబాద్​ గడ్డి అన్నారం మార్కెట్‌ను ఈనెల 18నాటికి ఖాళీ చేయాలని వ్యాపారులకు హైకోర్టు స్పష్టం చేసింది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఆటంకాలు సృష్టించడం దురదృష్టకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

గడ్డి అన్నారం మార్కెట్‌ను బాట సింగారం తాత్కాలిక మార్కెట్‌కు తరలించి.. ఇక్కడ ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాటసింగారం తాత్కాలిక మార్కెట్‌లో సరైన సదుపాయాలు లేవంటూ వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్లపై కొంతకాలగా విచారణ జరుగుతోంది. వ్యాపారులు ఖాళీ చేసేందుకు వీలుగా నెల రోజులపాటు మార్కెట్‌ తెరవాలని గత నెలలో మార్కెటింగ్‌శాఖను హైకోర్టు ఆదేశించింది.

కోర్టు ఆదేశించినప్పటికీ మార్కెట్‌లోకి వెళ్లనీయడం లేదని మళ్లీ వ్యాపారులు తెలపడంతో హుటాహుటిన మార్కెట్‌ తెరిచారు. అదే సమయంలో మార్కెట్‌లో కూల్చివేతలు చేపట్టడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. మార్కెటింగ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్‌ను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలమేరకు కూల్చివేతలు నిలిపివేసినట్టు ఇవాళ హైకోర్టుకు వివరించారు. విచారణ జరిపిన హైకోర్టు శుక్రవారం నాటికి వ్యాపారులు మార్కెట్‌ ఖాళీ చేసి బాటసింగారం వెళ్లాలని స్పష్టం చేస్తూ విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:Budget Sessions: బడ్జెట్​కు​ శాసనసభ ఆమోదం.. నిరవధిక వాయిదా

ABOUT THE AUTHOR

...view details