TS Highcourt: పండ్లను కృత్రిమంగా మాగబెట్టడానికి ఇథెఫాన్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిని కేవలం గ్యాస్ రూపంలోనే వినియోగిస్తున్నారని, ఇది కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చట్టానికి, నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. అందువల్ల ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లో జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోజాలమంది. అంతేగాక ఎన్‌రైప్ వినియోగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లోనూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదంది. ఇథలిన్ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్‌రైప్ వినియోగించాలని ప్రభుత్వం రైతులను, వ్యాపారులను చైతన్యం చేస్తోందని పేర్కొంది. ఇథెఫాన్ వినియోగానికి అనుమతిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ 2018లో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ నళిన్ వెంకటకిశోర్ కుమార్, మరొకరు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు, పలువురి పిటిషన్‌లను కొట్టివేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి ఇటీవల తీర్పు వెలువరించింది.
పండ్లను మాగబెట్టడంలో ఆ కెమికల్ వినియోగం చట్టబద్ధమే: హైకోర్టు - telangana high court
TS Highcourt: పండ్లను కృత్రిమంగా మాగపెట్టడానికి ఇథెఫాన్‌ను వినియోగించడం చట్టబద్ధమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఇథెఫాన్‌ను నేరుగా వినియోగించడంలేదని, కేవలం గ్యాస్ రూపంలోనే వినియోగిస్తున్నారని...ఇది కేంద్ర ఆహార భద్రతా ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఎఐ) చట్టానికి, నిబంధనలకు అనుగుణంగానే ఉందని పేర్కొంది. అంతేగాకుండా ఎన్‌రైప్ వినియోగించాలంటూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కూడా జోక్యం చేసుకోవాల్సిన అవసరంలేదని, ఇథలిన్ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా ఎన్‌రైప్ వినియోగించాలని ప్రభుత్వం రైతులను.. వ్యాపారులను చైతన్యం చేస్తోందని పేర్కొంది.
ఈ అంశానికి సంబంధించి కార్బైడ్ వినియోగంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని గతంలో ‘ఈనాడు’ రాసిన కథనాన్ని హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టింది. అనంతరం ఇదే అంశంపై కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడంతో దానిపై విచారణను మూసివేసింది. సైంటిఫిక్ కమిటీలోని నిపుణుల అభిప్రాయం, సలహాల మేరకు పలు నిబంధనలు రూపొందించి 2016లో జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ హైకోర్టులో దాఖలు చేసిన కౌంటరులో పేర్కొంది. అయితే పలు వినతి పత్రాల నేపథ్యంలో కార్బైడ్‌కు బదులుగా ఇథెఫాన్‌కు అనుమతిస్తూ 2018లో ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొంది. ఇది కేంద్ర క్రిమిసంహాకరక మండలి, రిజిస్ట్రేషన్ కమిటీలో కూడా రిజిస్టర్ అయిందని పేర్కొంది. కోర్టు సహాయకుడిగా ఉన్న సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి నివేదిక సమర్పిస్తూ ఇథెఫాన్ రసాయనమని, ఇథర్నల్‌కు ప్రత్యామ్నాయమని, ఇది ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న ధర్మాసనం ఇథెఫాన్ వినియోగానికి అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను రద్దుచేయాలన్న ప్రశ్నే రాదంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌రైప్ వాడాలన్న నిబంధన కూడా తప్పనిసరేమీ కాదని అందువల్ల , నిపుణుల సలహాల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమంటూ తీర్పులో పేర్కొంది .
ఇదీ చదవండి: