తెలంగాణ

telangana

By

Published : Aug 10, 2020, 8:59 PM IST

ETV Bharat / state

సుప్రీం తీర్పు త‌ర్వాతే డిగ్రీ, ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌!

తెలంగాణలో చివరి సెమిస్టర్ పరీక్షలు, ఎంట్రెన్స్​లపై హైకోర్టు విచారణ చేపట్టగా పరీక్షలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 14న విచారణ జరగనున్నట్లు ఏఐసీటీఈ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.

telangana high court hearing on entrance exams
సుప్రీం తీర్పు త‌ర్వాతే డిగ్రీ, ఎంట్రెన్స్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌!

తెలంగాణలో చివరి సెమిస్టర్ పరీక్షలు, ఎంట్రెన్స్​లపై హైకోర్టు విచారణ ఆగస్టు 17కు వాయిదా వేసింది. ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని... డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ ఎన్ఎస్​యూఐ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో సోమవారం విచారణ చేపట్టారు. పరీక్షలకు సంబంధించిన పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈ నెల 14న విచారణ జరగనున్నట్లు ఏఐసీటీఈ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.

ఈ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోందని.. చట్టం ప్రకారం ప్రవేశ పరీక్షల నిర్వహణ తప్పనిసరని వివరించింది. అయితే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకే వ్యవహరించాలని కేబినెట్ నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇతర సెమిస్టర్ విద్యార్థులను ప్రమోట్ చేయాలని ఇప్పటికే నిర్ణయించామని.. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదని హైకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

ఇదీ చూడండి:-ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details