రైతులు బీమా ప్రీమియం చెల్లించినా.. పంట నష్టపరిహారం చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను... హైకోర్టు ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆదిలాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త పాయల్ శంకర్.... హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
'బీమా చెల్లించినా... రైతులకు పరిహారం ఎందుకు చెల్లించడం లేదు'
బీమా ప్రీమియం చెల్లించినప్పటికీ.. రైతులకు పంట పరిహారం చెల్లించడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు... నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది.
రెండేళ్లుగా రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతులు ప్రీమియం చెల్లిస్తున్నా... ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పంటల బీమా పథకం కింద నష్ట పరిహారం చెల్లించట్లేదని పిటిషనర్ పేర్కొన్నారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం... ఆరు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు... నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఇఫ్కో టోకియో ఇన్సూరెన్స్ కంపెనీలను ఆదేశించింది.
ఇదీ చూడండి:ఏకపక్షంగా కాంట్రాక్టు రద్దు చేయడం సరికాదు: హైకోర్టు