రాష్ట్ర క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ మండలి ఏర్పాటుకు సంబంధించిన వివరాలు నాలుగు వారాల్లో సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. తెలంగాణతో పాటు దేశంలో ఎక్కడైనా రాష్ట్రస్థాయి క్లినికల్ ఎస్టాబ్లిషమెంట్ మండళ్లు ఏర్పాటయ్యాయా తెలపాలని కేంద్రాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం అమలు కావడం లేదని అవినీతి వ్యతిరేక ఫోరం వ్యవస్థాపకుడు విజయ్ గోపాల్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం విచారణకు స్వీకరించింది.