తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​ఈసీగా పార్థసారథి నియామకంపై సర్కారుకు నోటీసులు

ఎస్‌ఈసీగా పార్థసారథి నియామకంపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆయన నియామకం చట్టప్రకారం జరగలేదని న్యాయవాది సత్యనారాయణ పిటిషన్​ వేశారు.

ఎస్​ఈసీగా పార్థసారథి నియామకంపై హైకోర్టులో పిల్​
ఎస్​ఈసీగా పార్థసారథి నియామకంపై హైకోర్టులో పిల్​

By

Published : Dec 17, 2020, 3:13 PM IST

Updated : Dec 17, 2020, 8:59 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్​గా విశ్రాంత ఐఏఎస్ అధికారి పార్థసారథి నియామకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వం సిఫార్సు చేసిన వ్యక్తిని గవర్నర్ నియమించడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ న్యాయవాది పి.సత్యనారాయణ పిల్ దాఖలు చేశారు.

ఇటీవల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు అక్రమాలకు పాల్పడినప్పటికీ.. ఎస్ఈసీ నిరోధించ లేకపోయిందని... ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. జీహెచ్ఎంసీ మేయర్​ను మహిళకు రిజర్వేషన్ చేయడం చట్టవిరుద్ధమని.. ను జరపకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్​లో కోరారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. కౌంటరు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీని ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇదీ చూడండి:డ్రగ్స్ కేసుపై హైకోర్టు విచారణ 2వారాలకు వాయిదా

Last Updated : Dec 17, 2020, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details