పలు కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేయడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్లు దాఖలై సంవత్సరాలు గడుస్తున్నా.. పదేపదే గడవు కోరడం సరికాదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం వ్యాఖ్యానించింది. డైటీషియన్ ఉద్యోగానికి హెడ్ నర్సులు మాత్రమే అర్హులుగా నిర్ణయిస్తూ 2019లో దాఖలైన పిటిషన్ గురువారం విచారణకు వచ్చింది. వైద్య విద్య సంచాలకుడు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని.. కొంత సమయం కావాలని వైద్యారోగ్య శాఖ తరఫు న్యాయవాది కోరారు. గతంలో ఇదే విధంగా కోరారని అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. చివరి అవకాశం ఇస్తున్నామని.. 10వేల రూపాయలు న్యాయవాదుల కొవిడ్ సంక్షేమ నిధికి చెల్లించాలని ఆదేశించింది.
high court: కౌంటర్ దాఖలు చేయడంలో జాప్యంపై హైకోర్టు అసహనం - తెలంగాణ తాజా వార్తలు
పలు కేసుల్లో కౌంటర్లు దాఖలు చేయడంలో ప్రభుత్వ అధికారులు జాప్యం చేయడంపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. రెండు వేర్వేరు కేసుల్లో 10వేల రూపాయల చొప్పున చెల్లించాలని వైద్యారోగ్య శాఖ, జీహెచ్ఎంసీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
telangana high court
నాచారం పెద్దచెరువు ఎఫ్టీఎల్లో రోడ్డు నిర్మిస్తున్నారన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కౌంటరు దాఖలులో జాప్యం చేసినందుకు.. జీహెచ్ఎంసీని 10వేల రూపాయలు న్యాయవాదుల కొవిడ్ సంక్షేమ నిధికి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి:TRESA: రెవెన్యూశాఖలో పదోన్నతుల సమస్యను పరిష్కరించండి: ట్రెసా