టీవీ ఛానెళ్ల రేట్లు పెంచుతూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయం తుది తీర్పునకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. టారిఫ్ పెంపుపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ట్రాయ్‌తో పాటు కేంద్రాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. టారిఫ్ సవరిస్తూ నవంబరు 22న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తెలంగాణ కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య వేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది.
టీవీ ఛానెళ్ల రేట్లు పెంచుతూ ట్రాయ్ నిర్ణయం.. తుది తీర్పే ఫైనల్: హైకోర్టు - టీవీ చానల్స్ టారిప్ పెంచిన ట్రాయ్
టీవీ ఛానెళ్ల రేట్లు పెంచుతూ ట్రాయ్ తీసుకున్న నిర్ణయంపై కేబుల్ ఆపరేటర్స్ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాం ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రాయ్ తీసుకున్న నిర్ణయం తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది.
టీవీ ఛానెళ్ల టారిఫ్‌ను రూ.12 నుంచి రూ.19 పెంచడం కేబుల్ ఆపరేటర్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరపున న్యాయవాది తులసీరాజ్ గోకుల్ వాదించారు. నిబంధనల ప్రకారం చర్చించకుండానే ఏకపక్షంగా టారిఫ్ పెంచారన్నారు. ట్రాయ్ చట్టం ప్రకారం టారిఫ్‌పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జి.ప్రవీణ్ కుమార్ వాదించారు. పిటిషన్‌పై బ్రాడ్‌కాస్టర్ల తరఫు న్యాయవాది రాజశేఖర్ సల్వాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశిస్తూ విచారణను ఏప్రిల్ 27కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి: