తెలంగాణ

telangana

ETV Bharat / state

రెండేళ్లయినా తీర్పు అమలు చేయకపోవటంపై హైకోర్టు ఆగ్రహం - TELANGANA HIGH COURT FIRE ON GOVERNMENT FOR NOT EXECUTE THE JUDGEMENT

TELANGANA HIGH COURT FIRE ON GOVERNMENT FOR NOT EXECUTE THE JUDGEMENT
TELANGANA HIGH COURT FIRE ON GOVERNMENT FOR NOT EXECUTE THE JUDGEMENT

By

Published : Dec 4, 2019, 9:15 PM IST

Updated : Dec 4, 2019, 10:39 PM IST

21:03 December 04

రెండేళ్లయినా తీర్పు అమలు చేయకపోవటంపై హైకోర్టు ఆగ్రహం

    రాష్ట్ర భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదు మండలి ఏర్పాటు చేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై దాఖలైన పలు ఫిర్యాదులపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం... రాష్ట్రంలో భద్రత కమిషన్, పోలీసుల ఫిర్యాదుల మండలి ఏర్పాటు చేయాలని 2017 ఏప్రిల్ 27న ఆదేశించింది. తీర్పు ప్రతి అందిన 3 నెలల్లో ఏర్పాటు చేయడంతో పాటు మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేసింది. కాగా... తీర్పునిచ్చి రెండేళ్లయినా రాష్ట్ర భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదు మండలిని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని చంద్రశేఖర శ్రీనివాసరావు అనే వ్యక్తి న్యాయస్థానానికి లేఖ రాశారు. 

సుమోటోగా లేఖ...

    లేఖను సుమోటోగా పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణ జరుపుతోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి ధర్మాసనం ఎదుట ఇవాళ మరోసారి విచారణకు వచ్చింది. సర్కారు తీరు పట్ల ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రతీ విషయంలోనూ కోర్టు ధిక్కరణ కేసులు నమోదైతే కానీ స్పందించడం లేదని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 

ఈ నెల 30లోపు ఏర్పాటుకు ఆదేశాలు...

    లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్ విషయంలోనూ ప్రభుత్వం ఇదే వైఖరి చూపిందని న్యాయస్థానం పేర్కొంది. ఈనెల 27లోగా రాష్ట్రంలో భద్రత కమిషన్, పోలీసు ఫిర్యాదు మండలి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇదే చివరి అవకాశమన్న హైకోర్టు... ఆదేశాలు అమలు కాకపోతే ఈనెల 30న రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి వ్యక్తిగతంగా ధర్మాసనం ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: దిశ కేసులో ముందడుగు.. ఫాస్ట్‌ట్రాక్‌ ఏర్పాటుకు హైకోర్టు ఆమోదం

Last Updated : Dec 4, 2019, 10:39 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details